telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

విమర్శీంచేవాడే మనిషి

నీవు కనే కల
కళ్ళెదురుగనిలబడేలా
ప్రయత్నించు
కష్టాన్ని నమ్మిన
ప్రతివాడు తన గమ్యాన్ని
చేరాడు
కాసి వడపోసేదే జీవితం
కల్మషం లేని మనసుతో
చేసేప్రతి పని నిన్ను
మనిషిగ నిలబెడుతుంది
అవాక్కులు చవాక్కులు
నిన్ను చేరకుండా చూడు
విమర్శీంచేవాడే మనిషి
దాన్ని ఆహ్వానించేవాడే
మహామనిషి
సేవే పరమార్థం అని తెలుసుకో
కష్టం విలువ ప్రతిఫలం
ద్వారా తెలుస్తుంది
మనిషి విలువ
మరణించాక తెలుస్తుంది
ఏది శాశ్వతం కాదు
నీవు చేసే మంచిపని తప్ప
…………………………………
చంద్ర బింబం లాంటి మీ నగుమోము
చిన్న బోతే నేను చూడలేను
కలవరంలో నైనా కష్టాల్లో నైనా
చెదరనివ్వకు నీ నవ్వు
అలవాటుగానో పొరపాటుగానో
వాడి పోతే బాగోదు మీ ముకారవిందం
పదిలంగా వుంచు మీ ఆత్మస్తైర్యం
ధైర్యానికే దడపుడితే ఎలా???

Related posts