telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

పిరికి సమాజానికి ధైర్యం పోయాలనే జనసేన పార్టీని స్థాపించా : పవన్ కళ్యాణ్

pawan

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పిరికి సమాజానికి ధైర్యం పోయాలనే జనసేన పార్టీని స్థాపించానన్నారు పవన్. 2014లో జనసేన పార్టీని ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా సినిమాలకు సంబంధించిన అనేక విషయాలు తెలిపారు పవన్. సినిమాల్లోకి వస్తే.. తన స్థాయి చాలా తక్కువగా ఉంటుందని పలువురు అప్పట్లో మాట్లాడారన్నారు. తనతో సినిమా తీస్తే.. దాదాపు రూ.70 లక్షలతో తీయాలని కొందరు అన్నారన్నారు. కానీ తన స్థాయి ఏంటో సినిమాల్లో నిరూపించుకున్నానన్నారు పవన్. ఒకరు స్థాయి ఇంతే అనే మాటలు తాను నమ్మనన్నారు. అలాంటి వారి మాటలు నమ్మితే ఈరోజు నేను ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకునే ఉండేవాడిని కాదన్నారు.పిరికివాడిగా తాను బతకాలని అనుకోవడం లేదన్నారు. తనలో ఉన్న పిరికితనంపై చిన్నప్పటి నుంచే పోరాడానన్నారు పవన్ కళ్యాణ్.మనల్ని భయపెట్టే పరిస్థితుల్ని ఎదుర్కొనకపోతే.. మనలో ధైర్యం అనే కండ పెరగదన్నారు పవన్. పిరికితనం అంటే తనకు చాలా చిరాకు అన్నారు. ధైర్యంగా మన భావాల్ని వ్యక్తపరచాలన్నారు. ఓటమిని ఎదుర్కోవాలంటే చాలా బలమైన భావజాలం ఉండాలన్నారు. మతం, కులంతో నిలబడే భావజాలం ఉండకూదన్నారు.

Related posts