telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కవిత గ్రాండ్ విక్టరీ… మంత్రి హరీష్ రావు కామెంట్

Harish Rao trs

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత గ్రాండ్ విక్టరీ సాధించింది. మొదటి రౌండ్ లోనే ఆమె విజయం ఖరారైంది. మొత్తం 821 ఓట్లకు గాను కవితకు 531 ఓట్లు వచ్చాయి. 8 ఓట్లు చెల్లకుండా వృధా అయిపోయాయి. కాంగ్రెస్ అభ్యర్థి శుభాష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మి నారాయణలకు డిపాజట్లు కూడా దక్కలేదు. తొలి రౌండ్ లో బీజేపీ కి 39, కాంగ్రెస్ 22 ఓట్లు, వచ్చాయి. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాగా.. మొత్తం 823 ఓట్లతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు 728 ఓట్లు వచ్చాయి.

బీజేపీ అభ్యర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి 29 ఓట్లు సరిపెట్టుకున్నారు. దీంతో కల్వకుంట్ల కవిత గెలుపు అనివార్యం అయింది. అయితే దీనిపై మంత్రి హరీష్ రావు కామెంట్ చేసారు. ఎన్నిక ఏదయినా గెలుపు టీఆర్ఎస్ పార్టీదేనని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ కి కనీసం డిపాజట్లు కూడా రాలేదని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికలో కూడా ఇదే తరహా ఫలితం వస్తుందన్న.. హరీష్ తమ ప్రభుత్వంపై కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న ఆరోపణలు అబద్దమని నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంతో తేలిపోయిందన్నారు.

Related posts