telugu navyamedia
రాజకీయ

తెలంగాణ నుంచి ధాన్యం కొన‌లేము..

*పార్ల‌మెంట్‌లో కేంద్ర‌మంత్రి వ్యాఖ్య‌ల‌పై నిర‌స‌న‌..
*కేంద్రం తీరుకు టీఆర్ ఎస్ ఎంపీలు వాకౌట్‌.
*పార్ల‌మెంట్ సాక్షిగా కేంద్ర‌మంత్రి క్ష‌మాప‌ణ చెప్పాలి..

తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తెలంగాణలో ఉత్పత్తి అయిన ధాన్యం, బియ్యం మొత్తాన్ని కొనలేమని  కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి  పీయూష్ గోయల్ చెప్పారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సభలో కీలక ప్రకటన చేశారు. 

ఇప్పటికే ఎంసిఐ వద్ద భారీ నిల్వలు ఉన్నాయని, ఉత్పత్తి, డిమాండ్ ను బట్టి ఈ ఏడాదికి పంట కొనే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

అస్సాంలో ధాన్యం సేకరణ పై అడిగిన ప్రశ్నకు లోక్‌ సభ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాతపూర్వక సమాధానం. ధాన్యం సేకరణ కేవలం ఉత్పత్తి పైనే ఆధారపడి ఉండదు. మద్దతు ధర, డిమాండ్ , సప్లై  లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టత ఇచ్చారు ఆయన.

కాగా.. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రులను కలిసేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రుల బృందం మంగళవారం నాడు ఢిల్లీకి బయలు దేరిన సంగతి తెలిసిందే. పంజాబ్‌ రాష్ట్రం నుండి కొనుగోలు చేసినట్టుగానే తెలంగాణ రాష్ట్రం నుండి కూడా ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తుంది.

ఈ విషయమై కేంద్ర ఆహార శాఖ మంత్రిని కలిసేందుకు తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ లు ఢిల్లీకి వెళ్లారు.

Related posts