telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేంద్ర వ్యవసాయ బిల్లుపై కేకే విమర్శలు!

keshavarao trs mp

కేంద్ర వ్యవసాయ చట్టం బిల్లును రాజ్యసభలో టీఆర్ఎస్ సభ్యులు వ్యతిరేకించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వారు ఈ వ్యవసాయ బిల్లుకు ఆమోదం తెలుపలేదు. దీనిపై టీఆర్ఎస్ పక్ష పార్లమెంటరీ నేత కె.కేశవరావు స్పందించారు.ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రైతులకు అండగా లేని ఇలాంటి చట్టాలు ఎందుకని ప్రశ్నించారు.

కొత్త వ్యవసాయ చట్టంతో రైతులకు తీరని నష్టం కలిగే అవకాశం ఉందని అన్నారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్లకు మేలు చేసేలా ఈ కొత్త చట్టం ఉందని తెలిపారు. మార్కెటింగ్ ఏజెంట్లకు సైతం ఈ చట్టంతో నష్టాలు తప్పవని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరిస్తోందని కేకే విమర్శించారు.

Related posts