మహేశ్ హీరోగా, దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.
చిత్ర విజయాన్ని పురస్కరించుకుని చిత్రయూనిట్ బ్లాక్ బస్టర్ కా బాప్ అనే ట్యాగ్‌లైన్‌ను ఈ చిత్రానికి జోడించారు. చిత్ర బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్‌ను వరంగల్ హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర ఫస్ట్ వీక్ పోస్టర్‌ను విడుదల చేశారు. చిత్ర ఫస్ట్ వీక్ కలెక్షన్లు 100 కోట్ల ప్లస్ షేర్‌గా చిత్రయూనిట్ ప్రకటించారు. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం ఫస్ట్ వీక్‌లో 100 కోట్ల ప్లస్ షేర్ సాధించి నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసినట్లుగా ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు.