telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

టేకాఫ్‌కు రెడీగా ఫ్లైట్… ఇంతలో పైలెట్ల అరెస్ట్

PLane

టేకాఫ్ కు ఫ్లైట్ రెడీగా ఉండగా… అంతలోనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇద్దరు పైలెట్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటన గ్లాస్గో విమానాశ్రయంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ 162 విమానం గ్లాస్గో ఎయిర్ పోర్టు నుంచి న్యూజెర్సీ వెళ్లాల్సి ఉంది. ఆదివారం ఉదయం 9 గంటలకు ఫ్లైట్ బయల్దేరాలి. ఇంతలో స్కాట్లాండ్ పోలీసులు ఇద్దరు పైలట్లను అరెస్ట్ చేశారు. వారిద్దరూ మద్యం, మాదకద్రవ్యాల మత్తులో ఉన్నారనే అనుమానంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రవాణా భద్రతా చట్టంలోని ఒక సెక్షన్ ప్రకారం పైలట్లను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం వారు మద్యం, మాదకద్రవ్యాలు సేవించినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Related posts