telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారు: మంత్రి బొత్స

గత ప్రభుత్వ హయాంలో రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసంచేశారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాజధాని భూముల్లో కుంభకోణం జరిగిందంటూ ఆరోపించారు. సన్న, చిన్నకారు రైతులను మోసం చేసి పెద్దలు దోచుకున్నారని ఆరోపించారు. రాజధానిలో 25 శాతం పనులపైనే విచారణ చేస్తున్నామని తెలిపారు.

మిగతా పనులను నిలిపివేయాలని ప్రభుత్వం చెప్పలేదని బొత్స స్పష్టం చేశారు. ఇప్పుడు తాము మంచి పనులు చేస్తుంటే మద్దతు ఇవ్వకుండా సభ నుంచి చంద్రబాబు పారిపోయారంటూ దుయ్యబట్టారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ల అమలు చారిత్రక నిర్ణయం అని బొత్స పేర్కొన్నారు. ప్రజలకు పాలన చేరువకావాలనే వార్డు, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్టు బొత్స తెలిపారు.

Related posts