బ్రెజిల్ లో జరిగిన ఓ దొంగతనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ఫార్మసీ స్టోర్‌లోకి మారణాయుధాలతో ప్రవేశించిన దొంగల్లో ఒకడు దుకాణంలో ఉన్న పెద్దావిడ నుదుటిపై ముద్దుపెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బ్రెజిల్‌లోని ఓ మందుల దుకాణంలో జరిగిందీ ఘటన. హెల్మెట్లు ధరించి, మారణాయుధాలతో ఉన్న ఇద్దరు దుండగులు ఓ ఫార్మసీ స్టోర్‌లోకి ప్రవేశించారు. ఆ సమయంలో షాపు యజమాని, ఓ పెద్దావిడ మాత్రమే అక్కడ ఉన్నారు. ఓ దొంగ యజమానిని బెదిరించి డబ్బు తీసుకుంటుండగా, రెండు చేతుల్లో రెండు తుపాకులు పట్టుకున్న మరో దొంగ పెద్దావిడ వద్ద నిల్చున్నాడు. దీంతో ఆమె తన వద్ద ఉన్న డబ్బులు కూడా అతనికి ఇవ్వబోయింది. వాటిని తీసుకోవడానికి నిరాకరించిన ఆ దొంగ.. ఆమె నుదిటిపై ముద్దుపెట్టాడు. ఆ తర్వాత ఆమెతో మాటలు కలిపి, భుజం తట్టడం కూడా వీడియోలో రికార్డయింది. మరో దొంగ మాత్రం షాపులోని కొన్ని సామాన్లు, 240 డాలర్లు డబ్బు తీసుకున్నాడు. అనంతరం ఇద్దరూ పరారయ్యారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
previous post
next post
చంద్రబాబును విమర్శించే స్థాయి రోజాకు లేదు: దివ్యవాణి