ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో కమలం పార్టీకి గట్టి షాక్ తగిలింది. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్య ఆకుల సత్యనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. రాజమండ్రి అర్బన్ పార్టీకి రాజీనామా చేసి, ఆ లేఖను జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు అందజేశారు. ప్రస్తుతం ఏపీ బీజేపీలో తలెత్తిన వివాదాలు తనకు మింగుడు పడడం లేదని, కన్నాకు పార్టీ కేడర్‌కి అగాధం ఏర్పడిందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. తన వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
కలమం పార్టీకి సత్యనారాయణ గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరతారనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఆయన జనసేన పార్టీలో చేరుతారని సమాచారం. ఆకుల సత్యనారాయణ సతీమణి జిల్లాలో జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటంతో ఆయన జనసేన తీర్థం పుచ్చుకోవడం లాంచనమేనని వార్తలు వినిపిస్తున్నాయి.
జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీకి మంచి రోజులు: మోహన్ బాబు