telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

అమెరికా చెర నుండి .. 8 మంది విద్యార్థులకు ఊరట..

trump new policies on h1b visa

ఇటీవల నకిలీ పత్రాలతో దేశంలో అడుగుపెట్టారని అమెరికా 29 మంది భారత విద్యార్థులను ఖైదు చేసిన విషయం తెలిసిందే. అందులో కొందరికి ఊరట లభించింది. అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు, ఎఫ్బీఐ కలిసి ఏర్పాటు చేసిన నకిలీ యూనివర్శిటీ ఫర్మింగ్టన్ ఉచ్చులో పడ్డ 8 మంది తెలుగు విద్యార్థులు బయటపడ్డారు. వీరి కేసు కోర్టుకు రావడంతో వారంతా తాము స్వచ్ఛందంగా దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని న్యాయమూర్తికి చెప్పడంతో, వారు తిరిగి ఇండియా వెళ్లేందుకు న్యాయమూర్తి అంగీకరించారు.

అంతకుముందు ఈ కేసులో న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, మరోసారి అమెరికా రావాలని భావిస్తే, సరైన వీసా పత్రాలతో దర్జాగా రావచ్చని ఆయన తెలిపారు. కాగా, తమను జైలు నుంచి విడిపించేందుకు సహకరించిన తెలుగు సంఘాల ప్రతినిధులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో ఇంకా 30 మంది వరకూ జైళ్లలో ఉండగా, మరో 50 మందికి పైగా జియో ట్యాగ్ అరెస్ట్ లతో బయట తిరుగుతున్నారు.

Related posts