telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

పెసల్లు తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!

పెసల్లో పోషకాలు మెండుగా ఉంటాయనీ ఆరోగ్యానికి మంచిదనీ తెలిసిందే. మొలకల్లో ఎంజైములూ యాంటీ ఆక్సిడెంట్లూ మరింత ఎక్కువగా లభ్యమవుతాయి. అందుకే ఇటీవల వీటిని చాలామంది మొలకెత్తించి తింటున్నారు. అయితే వీటిని మొలకల రూపంలోనో లేదా ఉడికించో… ఎలా తిన్నా కాలేయం, జుట్టు, గోళ్లు, కళ్ల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని ఆయుర్వేదం పేర్కొంటోంది.
* క్యాలరీలు తక్కువ, పీచు ఎక్కువగా ఉండటంతో కొంచెం తిన్నా పొట్ట నిండినట్లనిపిస్తుంది. ఫలితంగా వూబకాయం తగ్గుతుంది.
* పెసల్ని క్రమం తప్పకుండా తినేవాళ్లు వయసుకన్నా పదేళ్లు తక్కువగా కనిపిస్తారు. ఇందులో అధిక కాపర్‌వల్ల చర్మం ముడుతలు పడకుండా ఉంటుంది.
* అజీర్తి, జీవక్రియాలోపంతో బాధపడేవాళ్లకు పెసలు మందులా పనిచేస్తాయి. కొలెస్ట్రాల్‌నూ తగ్గిస్తాయి. వీటిల్లోని కాల్షియం ఎముక నిర్మాణానికీ దోహదపడుతుంది. సోడియం దంతాలు, చిగుళ్ల సమస్యల్నీ నివారిస్తుంది. బీపీ రోగులకీ ఇవి మంచిదే. పెసల్లోని ఐరన్‌వల్ల అన్ని అవయవాలకీ ఆక్సిజన్‌ సమృద్ధిగా అందుతుంది. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి… వంటి లోపాలతో బాధపడే వాళ్లకీ ఇవి ఎంతో మేలు. రోగనిరోధకశక్తినీ పెంచుతాయి. వీటిల్లోని విటమిన్లు హార్మోన్లను ప్రేరేపించడంతో పిల్లల్లో పెరుగుదలకీ తోడ్పడతాయి.

Related posts