కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షలు చేయించుకోగా… ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యిందని కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంచార్జ్ జైరామ్ రమేశ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు
ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, హోం ఐసోలేషన్‌లో ఉన్నారని జైరామ్ వెల్లడించారు. సోనియా గాంధీ కుమార్తె, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం ఇటీవలే కొవిడ్ బారిన పడ్డారు.
సోనియా గాంధీ కొవిడ్ బారిన పడడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. జూన్‌లో ఆమెకు కొవిడ్ నిర్ధరణ అయ్యింది. దీంతో పోస్ట్ కరోనా సమస్యలతో అదే నెల 12వ తేదీ దిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేరారు. జూన్ 20న కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రెండు నెలలు తిరగకముందే మరోసారి కొవిడ్ బారిన పడడం గమనార్హం.