telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆంధ్ర ప్రదేశ్ అంటే అడవాళ్ల ప్రదేశ్ గా మారాలి: రోజా

roja ycp mla

ఏపీ అసెంబ్లీ లో ఈ రోజు మహిళల భద్రతపై చర్చ ఆసక్తికరంగా సాగింది. వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. రాష్ట్రం మహిళాంధ్రప్రదేశ్ గా మారాలని పేర్కొన్నారు. తెలంగాణలో చోటుచేసుకున్న దిశ హత్యాచార ఘటన తర్వాత, తొలిసారిగా ఏపీలో మహిళా భద్రతపై చర్చ సాగుతున్ననేపథ్యంలో దేశ వ్యాప్తంగా మహిళలు గమనిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీలో దీనిపై ఏమైనా చట్టాలు చేస్తారేమోనని ఎదురుచూస్తున్నారన్నారు. దిశను అత్యాచారం చేసి చంపి కాల్చివేసిన విధానం చూస్తే.. మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కన్నీళ్లొస్తాయని చెప్పారు.

నిన్న దిశ, మొన్న రిషితేశ్వరి, అంతకు ముందు నిర్భయ.. ఇంకా ముందు చూస్తే స్వప్నిక, ప్రణీత.. మృగాళ్లకు బలయ్యారన్నారు. ఇలా మృగాళ్లకు బలి కావాల్సిందేనా అన్నభయంతో మహిళలు కంటిపై కునుకు లేకుండా భయభ్రాంతులకు లోనవుతున్నారన్నారు. జగనన్నను ఒకటే కోరాలనుకుంటున్నా.. ‘ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే వారికి వెన్నులో వణుకు పుట్టేలా ఒక చట్టాన్ని తేవాలి. ఆంధ్ర ప్రదేశ్ అంటే అడవాళ్ల ప్రదేశ్ గా మారాలని అన్నారు.

Related posts