విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ నెల 25న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ మూవీలో రమ్యకృష్ణ విజయ్ కి తల్లి పాత్ర చేస్తుండగా పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు ఈ మూవీని ఎంతో భారీ స్థాయిలో నిర్మించాయి. ఇప్పటికే మన దేశంలోని పలు ముఖ్య ప్రాంతాల్లో ఫ్యాన్డం టూర్స్ ప్లాన్ చేసిన లైగర్ టీమ్, మూవీని మరింతగా ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి చేరువ చేసేందుకు సిద్ధం అయింది.
యాక్షన్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన లైగర్ నుండి ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ఆడియన్స్ ని ఆకట్టుకోగా శుక్రవారం ఈ మూవీ నుండి కోకా‘కోకా 2.0..’ అనే పాటని రిలీజ్ చేసారు.భాస్కరభట్ల రాసిన ఈ మాస్ బీట్ సాంగ్ ని రామ్ మిరియాల, గీత మాధురి ఎంతో అద్భుతంగా పాడారు. ఈ పాటలో పూరి జగన్నాథ్ కూడా కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సాంగ్ మంచి వ్యూస్ తో కొనసాగుతోంది.