జమాతుల్ దవా చీఫ్ హఫీజ్ మొహ్మద్ సయీద్‌కు ఓ కేసులో బెయిల్ లభించింది. పాకిస్థాన్‌కు చెందిన యాంటీ టెర్రరిజం కోర్టు ముందుస్తు అరెస్టు బెయిల్‌ను మంజూరీ చేసింది. అక్రమంగా భూమిని వాడుకున్నారన్న కేసులో హఫీజ్‌తో పాటు మరో ముగ్గురు కూడా బెయిల్ కోసం కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు.
ఆగస్టు 31 వరకు 50వేల సెక్యూర్టీ బాండ్‌పై ముగ్గురికీ ముందస్తు బెయిల్‌ను ఇస్తున్నట్లు ఏటీసీ చెప్పింది. జమాతుల్ దావా సంస్థ ఎటువంటి భూమిని కూడా అక్రమంగా వినియోగించడం లేదని కోర్టు ముందు వాదించింది. తమ బెయిల్ అభ్యర్థనలను స్వీకరించాలని హఫీజ్ కోరారు.