telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వరంగల్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..5 సమీకృత మార్కెట్లు

వరంగల్ మహా నగరంలో 5 సమీకృత మార్కెట్లు చేయనున్నట్లు మంత్రి దయాకర్ రావు అన్నారు. గజ్వేల్ తరహాలో  మోడల్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు…కనీసం 5 ఎకరాల్లో ఒక్కో మార్కెట్ ఉండనున్నట్లు తెలిపారు. లక్ష్మీపురం మార్కెట్ కి .24 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలసి నగరంలోని పలు స్థలాలను ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలించారు మంత్రి దయాకర్ రావు. మహా నగరంలో సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సంబంధిత శాఖల అధికారుల తో కలసి నగరంలోని పలు స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పురపాలక శాఖ మంత్రి అదేశాఖ ప్రకారం గజ్వెల్ మాదిరిగా మోడల్ మార్కెట్ ఏర్పాటుకు కనీసం 5 ఎకరాల స్థలం ఉండే విధంగా నగరంలో కనీసం 5 ప్రదేశాల్లో సమీకృత సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటుకు అనువైన స్థలాలను వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

Related posts