telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

నాగార్జునకు డూప్ గా.. శ్రీకాంత్ నటించాడట.. బిగ్ షో లో హల్ చల్…

nagarjuna on his dual role doop character

నాగార్జున సినీ కెరీర్లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ హలో బ్రదర్ సినిమా కి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. సినిమాలో నాగార్జున డబుల్ రోల్ పోషించారు.ఈ వి వి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన హలో బ్రదర్ సినిమా లో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున తన కెరియర్ లోనే మొదటి సారి డబుల్ రోల్ లో నటించారు. అంతేకాకుండా డబుల్ రోల్లో నటించిన నాగార్జున నటనకు ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర కూడా బంపర్ హిట్ గా నిలిచింది. అయితే ఇక అప్పటి నుంచి నాగార్జున ఇప్పటివరకు మరోసారి డ్యూయల్ రోల్ లో నటించలేదు. ఆ తర్వాత ఎన్నో విజయాలను సొంతం చేసుకుని అంచలంచలుగా ఎదిగి టాలీవుడ్ మన్మథుడు గా పేరుతెచ్చుకున్నాడు నాగార్జున. ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

గత వంద రోజుల నుండి తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో లో నేడు టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోయింది. ఫైనల్ కి చేరుకున్న ఐదుగురి సభ్యుల్లో ఇప్పటికే అలీ రాజా ఎలిమినేట్ అయ్యారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ మొత్తం ఫుల్ సందడి గా మారిపోయింది. ఈ సందర్భంగా నాగార్జున ఒక ఆసక్తికర విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు. తన కెరియర్లోనే ప్రత్యేక సినిమా అయినా హలో బ్రదర్ సినిమాలో తనకు డూప్ గా నటించిన హీరో ఎవరో తెలిపారు నాగార్జున. హలో బ్రదర్ సినిమా లో తన డూప్ గా హీరో శ్రీకాంత్ రెండు సినిమాలలో కనిపించారని నాగార్జున వెల్లడించారు.

Related posts