ఇటీవల కారవాన్ ల గురించి వార్తలు ఎక్కువ అయ్యాయి. మొన్నటిదాకా అల్లు అర్జున్ కారవాన్ పై వార్తలు హాల్ చల్ చేశాయి. ఇప్పుడు మహేష్ మీద పడ్డారు. మహేష్ బాబుకు గతంలో కూడా ఒక కారవాన్ ఉండేది, కానీ ఇప్పుడు అంతకంటే మెరుగైన వసతులు ఉండేలా కొత్త కారవాన్ డిజైన్ చేయించుకున్నాడట. ప్రముఖ ఆటోమొబైల్ డిజైనర్ దిలీప్ ఛాబ్రియా మహేష్ అభిరుచులకు తగ్గట్టుగా కారవాన్ ను డిజైన్ చేయించి ఇచ్చారట.
అవుట్ డోర్ షూట్ లకు హాజరైన సమయంలో మహేష్ విశ్రాంతి తీసుకునే ఏర్పాట్లతో పాటుగా.. షూటింగ్ సమయంలో మహేష్ కుటుంబ సభ్యులు కూడా హాయిగా గడపగలిగేలా కారవాన్ డిజైన్ చేయించారట. ఇందులో అన్ని రకాల వసతులు ఉన్నాయట. టాలీవుడ్ స్టార్ హీరోలలో మహేష్ కారవాన్ అత్యంత ఖరీదైనదని అంటున్నారు. మహేష్ లగ్జరీ కారవాన్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
రాజశేఖర్ ను ఫ్రాడ్ అన్న జీవిత… అందరూ షాక్…!?