telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నందమూరి బాలయ్యతో కయ్యానికి దిగనున్న బాలీవుడ్ నటుడు

Balakrishna

నందమూరి బాలకృష్ణ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. తన పవర్‌ఫుల్ డైలాగ్‌లు నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. బాలయ్య తన కొత్త సినిమాను బోయపాటి దర్శకత్వంలో చేయనున్నట్లు తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఈ కాంబోలో వస్తున్న మూడో సినిమాగా మంచి అంచనాలు పొందింది. బాలయ్య, బోయపాటి కాంబో అంటేనే అభిమానులకు వెర్రెక్కుతోంది. సినిమాను ఏరేంజ్‌లో ఉంటుందని ఊహించాడానికి కూడా కష్టతరం అవుతోంది. వీరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్‌లుగా నిలిచాయి. అయితే ఈ మూడో సినిమాలో నటీనటులు ఇంకా ఎంపిక కాలేదు. హీరోయిన్ విషయానికొస్తే రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. ఇక విలన్ అంటారా మొదట సంజదత్ ఈ సినిమాలో విలన్ పాత్ర చేయనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ మళ్లీ సంజయ్ ఈ సినిమాలోకనిపించడని, విలన్ పాత్రలో మరో నటుడు చేయనున్నాడని అన్నారు. బాలివుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ సినిమాలో బాలయ్యకు ఎదురు వెళ్లనున్నాడని సమాచారం. ఈ వార్తలు సినీ వర్గాలలో తెగ షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది జనవరీ లేదా ఫిబ్రవరీలలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎప్పుడు ఎంపిక అవుతుందో చూడాలి.

Related posts