telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పార్టీ పెట్టకముందే వైఎస్ షర్మిలకు దిమ్మతిరిగే షాక్

వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక, వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి.. వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు.. తెలంగాణ సర్కార్ వైఫల్యాలను కూడా ఎత్తి చూపడం మొదలు పెట్టారు. ఇక, ఇవాళ  ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించిన షర్మిల.. కొత్త పార్టీ ప్రకటనపై క్లారిటీ ఇచ్చారు.. ఏప్రిల్‌ 9వ తేదీన పార్టీ ప్రకటన ఉంటుందని… లక్షమంది సమక్షంలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేయనున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ షర్మిలకు ఊహించని షాక్‌ తగిలింది. తెలంగాణలో కరోనా తీవ్రత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో జీవో 68, 69 ప్రకారం షర్మిల సభకు అనుమతు రద్దు చేస్తున్నట్లు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే… నిబంధనలు పాటిస్తూ సభ జరుపుతామని షర్మిల బృందం సమాధానం ఇచ్చిందట. తెలంగాణలో పార్టీ స్థాపించాలని నిర్ణయించుకున్న వైఎస్ షర్మిల… ఈ నెల 9న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా సభ నిర్వహణపై అనుమాన మేఘాలు ముసురుకుంటున్నాయి. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్ లో సభకు షర్మిల బృందం ఇటీవల పోలీసుల నుంచి అనుమతి తీసుకుంది. ఇంతలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడంతో పోలీసు శాఖ పునరాలోచనలో పడింది. ఈ క్రమంలోనే పోలీసులు షర్మిల బృందానికి నోటీసులు జారీ చేశారు. జీవో 68, 69 ప్రకారం ఖమ్మం జిల్లా ఇన్చార్జి లక్కినేని సుధీర్ కు నోటీసులు పంపారు. అయితే, కరోనా మార్గదర్శకాలు, అన్ని నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహిస్తామని షర్మిల బృందం పోలీసులకు బదులిచ్చినట్టు తెలుస్తోంది.

Related posts