telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నందమూరి బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్‌

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ “బిబి-3” పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన బీబీ 3 టీజర్‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్, కరోనా కారణంగా వాయిదా పడగా, త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.  అయితే… ఈ సినిమా నుంచి అదిరిపోయే న్యూస్ వచ్చేసింది.  ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఈ రోజు సాయంత్రం 3గంటల 36 నిమిషాలకి అనౌన్స్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ద్వారక క్రియేషన్స్ వారు తెలిపారు. ఈ వార్తతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అయింది. ఈ సినిమాలో తమ అభిమాను హీరో లుక్స్ ఎలా ఉంటాయిని వారు వేచి చూస్తున్నారు. మరి రానున్న అప్‌డేట్ ఏంటని వేచి చూడాలి.

Related posts