telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓ మహానటుడికి అప్పు ఇచ్చిన వేణుమాధవ్… ఎవరికంటే ?

Venu

ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గతనెల 25న తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూతుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. వెండితెర‌పైనే కాదు బుల్లితెర‌పై కూడా ఆయ‌న రాణించారు. ప‌లు కార్య‌క్ర‌మాల‌కి ఆయ‌న యాంక‌ర్‌గా కూడా ప‌ని చేశారు. రాజ‌కీయాల‌లోను చురుకుగా ప‌ని చేవారు. దాదాపు 600కి పైగా సినిమాల‌లో నటించిన వేణు మాధవ్ హంగామా, భూ కైలాస్ చిత్రాల‌లో హీరోగా చేశారు. ఆయ‌న‌కి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అనారోగ్య కార‌ణాల వ‌ల‌న ఐదేళ్లుగా సినిమాల‌కి దూరంగా ఉన్నారు వేణు మాధ‌వ్. చివ‌రిగా రుద్ర‌మ‌దేవి చిత్రంలో కనిపించారు. వేణుమాధవ్ అంత్యక్రియలు మౌలాలీలో ఆయన అభిమానుల మధ్య ముగిశాయి. ఇంకా ఆయనతో వున్న జ్ఞాపకాలను పలువురు తారలు గుర్తు చేసుకుంటున్నారు. వారిలో సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు కూడా వున్నారు. వేణు మాధవ్ గురించి ఆయన మాట్లాడుతూ “ఓసారి వేణు మాధవ్ ముత్యాలు వస్తావా – అడిగింది ఇస్తావా అనే పాటకు అల్లు రామలింగయ్య గారిలా అనుకరిస్తూ చేసిన నటన చూసి నేను ఆశ్చర్యానికి గురయ్యాను. అచ్చం అల్లు రామలింగయ్యగారిలానే నటిస్తూ వేణు మాధవ్ అద్భుతంగా చేసి చూపించాడు. ఇంకా అతడిలో ఎన్నో విద్యలున్నాయి. ఓసారి నేను షూటింగ్ చేస్తున్న సమయంలో నాకు అర్జెంటుగా 2 వేల రూపాయలు అవసరపడ్డాయి. డబ్బు కావాలని అడగ్గానే వెంటనే రెండు వేలు ఇచ్చాడు. ఆ తర్వాత ఆ డబ్బును వెనక్కి ఇవ్వబోతే తీసుకోలేదు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ డబ్బును వేణు మాధవ్ తీసుకునేందుకు అంగీకరించలేదు. ఎందుకు డబ్బు తీసుకోవూ అని అడిగితే… ఓ మహా నటుడికి అప్పు ఇచ్చానని చెప్పుకుంటాను” అని అన్నాడు వేణు మాధవ్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts