telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

అసత్య కథనాలు ప్రసారం చేశారని “టీవీ9” పై శివాజీ ఫైర్

hero shivaji comments Cm kcr

హైదరాబాద్ లోనే ఉన్న తనపై అసత్య కథనాలు ప్రసారం చేశారని టీవీ9 పై నటుడు శివాజీ మండిపడ్డారు. అలందా మీడియా కేసులో శివాజీ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమెరికా వెళ్లేందుకు యత్నించిన శివాజీని గతంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. రెండు రోజుల క్రితం దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లేందుకు యత్నించారని, ఆయన్ని అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో శివాజీ స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వార్తలు అబద్ధమని కొట్టిపారేశారు. తెలంగాణ పోలీసులకు చేతగాక, దుబాయ్ పోలీసులు తనను పట్టుకున్నారని టీవీ9 చెప్పాలనుకుంటోందా? అని ప్రశ్నించారు. టీవీ 9 తమ యజమానులను సంతోషపెట్టేందుకు అసత్య కథనాలు ప్రసారం చేస్తోందని. తనను పోలీసులతో చంపేస్తే అప్పుడు వారి పగ తీరుతుందేమో అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. 

Related posts