telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

సిగరెట్ల గోదాంలో చోరీ..రూ.60 లక్షల సొత్తు అపహరణ

హైదరాబాద్ చందానగర్ లోని ఓ సిగరెట్ల గోదాంలో చోరీ జరిగింది. నిన్న ఎప్పటిలాగే విధుల్లోకి వచ్చిన సిబ్బంది తాళాలు పగులగొట్టి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించగా ముందురోజు రాత్రి నలుగురు వ్యక్తులు ముసుగులతో వ్యాన్లో వచ్చారు. మెట్ల మార్గంలో పై అంతస్తుకు వెళ్లారు. గడ్డపారతో ఇనుపజాలీ తొలగించి గోదాము లోపలికి ప్రవేశించారు.

సీసీ కెమెరాల వైర్లు కట్ చేశారు. గోదాములో దాదాపు రూ.6 కోట్ల విలువైన సరుకు ఉండగా అందులో 60 కార్టన్లను ఎత్తుకెళ్లారు. ఒక కార్టన్ అంటే పది ప్యాకెట్లు లేక 200 సిగరెట్లు ఉంటాయి. కొన్ని కార్టన్లలో 20 ప్యాకెట్లు, మొత్తం 400 సిగరెట్లు ఉంటాయి. చోరీ సొత్తు విలువ అరవై లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.

Related posts