telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ డ్యాన్సరే.. కొరియోగ్రాఫర్ అయితే…!

Sai-pallavi

సాయి పల్లవి.. ఎంత గ్రేట్ డ్యాన్సరో ‘ ఫిదా ‘ మూవీ నిరూపించింది. ఆ సినిమాలోని ‘ వచ్చిందే మెల్లా మెల్లగ వచ్చిందే’ సాంగ్ జనాలకు నచ్చడమే కాదు. యూట్యూబ్ ను కూడా ఓ ఊపు ఊపింది. అలాగే ఆమె తమిళ్లో హీరో ధనుష్ సరసన నటించిన మారి-2 సినిమా లోని ‘ రౌడీ బేబీ ‘సాంగ్ కూడా దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. యూట్యూబ్ లో ఆ సాంగ్ 500 మిలియన్స్ పైగా వ్యూస్ దక్కించుకుంది. పడి పడి లేచే మనసు, ఎంసీఏ చిత్రాల్లో కూడా సాయి పల్లవి డ్యాన్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ ‘ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఫిదా మూవీలోని పాటలకు చక్కటి ప్రదర్శన చేసిన సాయి పల్లవికి మరో బాధ్యత అప్పగించాలని శేఖర్ కమ్ముల డిసైడ్ అయ్యాడట. లవ్ స్టోరీ సినిమాలో ఓ పాటకు కొరియోగ్రఫీ అందించాలని కోరగా..అందుకు సాయి పల్లవి ఓకే చెప్పిందని సమాచారం. గ్రేట్ డ్యాన్సర్ అయిన సాయి పల్లవి.. తన పాటకు తనే కొరియోగ్రఫీ చేస్తే ఇక అదిరి పోవడం ఖాయమని ఆమె అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related posts