వడ్డీరేట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. వడ్డీరేట్లలో ఆర్బీఐ ఎలాంటి చేయడం లేదని.. రెపోరేటు, రివర్స్ రెపోరెటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇవాళ జరిగిన పరపతి విధాన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకుంది. రెపోరెటు 4 శాతం, రివర్స్ రెపోరేటును 3.3 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. 2021-22 ఏడాదికి గానూ జీడీపీ వృద్ధిరేటు 10.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. అటు ఆర్బీఐ విధాన పరపతి సమీక్ష నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 165.96 పాయింట్ల లాభంతో 49,367 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 63.05 పాయింట్లు లాభపడి 14, 746 వద్ద ట్రేడవుతోంది. 2021లో భారత్ 12.5 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకునే అవకాశముందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనావేసిన విషయం తెలిసిందే. చైనాకంటే ఎక్కువగా భారత్ వృద్ధిరేటు సాధించే అవకాశముందని అంచనావేసింది. కరోనా కారణంగా నెలకొన్న ఆర్థిక కష్టాలను భారత్ అత్యంత వేగంగా అధిగమిస్తున్నట్లు ఐఎంఎఫ్ అంచనావేసింది.
previous post