నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న కథాచిత్రం ‘బ్యాక్ డోర్’ షూటింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. ప్రముఖ కథానాయకి పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ వినూత్న కథా చిత్రాన్ని… ‘ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్’ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. యువ కథానాయకుడు తేజ త్రిపురాన మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయితే.. తాజాగా ఇందులోని ‘యుగాల భారత స్త్రీని’ అనే పల్లవితో సాగే పాటను లోటస్ పాండ్ లో తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వై. ఎస్. షర్మిల ఆవిష్కరించారు. ఈ సినిమా చక్కని విజయం సాధించి, చిత్ర బృందానికి మంచి పేరు రావాలని ఆమె ఆకాంక్షించారు. ‘ఎంతో బిజీ షెడ్యూల్ మధ్య తమకు సమయం కేటాయించి… పాటను విడుదల చేయడంతో పాటు తమను అభినందించిన షర్మిలగారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని నిర్మాత బి. శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు బాలాజీ, సహ నిర్మాత ఊట శ్రీను, చిత్ర సమర్పకులు సెవెన్ హిల్స్ సతీష్ కుమార్, చిత్ర కథానాయకుడు తేజ త్రిపురాన పేర్కొన్నారు.
previous post