దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.28 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 1,15,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 630 మంది మృతి చెందారు. అటు మహారాష్ట్రలో రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. గడిచిన కొద్ది రోజులుగా వీకెండ్ లాక్‌డౌన్, కర్ప్యూ విధించిన కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలో మరోసారి కొత్తగా 55 వేలకు మించిన కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంట్లో ఏకంగా 297 మంది మృతి చెందారు. దీని ప్రకారం చూస్తే.. ప్రతీ ఐదు నిమిషాలకు కరోనాతో ఒకరు మృతి చెందుతున్నారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 55, 469 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మొత్తం 34,256 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో గడిచిన 24 గంటల్లో 10,030 కరోనా కేసులు నమోదయ్యాయి. 31 మంది కరోనా కారణంగా మృతిచెందారు. మహానగరంలో 4,72,332 మంది కరోనా బారీన పడ్డారు.
next post
రెండు గాజులు ఇస్తే ఎవరు నమ్మరు.. నారా భువనేశ్వరిపై రోజా ఫైర్