telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కిట్లు వాడే విధానం తెలియక మాపై నిందలు వేస్తారా?: భారత్ పై చైనా అసంతృప్తి

Rapid Testing Kits China India Corona

చైనా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా నిర్వహించిన కరోనా పరీక్షల్లో తప్పుడు ఫలితాలు వస్తున్నాయని భారత్ చేసిన ఆరోపణల పై చైనా సంస్థలు ఘాటుగా స్పందించాయి. కిట్లను ఉపయోగించే విధానం తెలియక మాపై ఆరోపణలు చేస్తారా? అంటూ రెండు సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

తాము తయారుచేసిన కిట్లలో ఎలాంటి లోపాలు లేవని, లోపం ఉన్నదల్లా భారత్ లోని వైద్యసిబ్బందిలోనే అని ఆయా సంస్థలు స్పష్టం చేశాయి. తాము ఈ కిట్లను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నామని వోండ్ ఫో బయోటెక్, లివ్ జోన్ డయాగ్నస్టిక్స్ సంస్థలు వెల్లడించాయి. టెస్ట్ కిట్ పై ఉన్న సూచనలను పూర్తిగా చదివిన తర్వాతే వాటితో పరీక్షలు నిర్వహించాలని హితవు పలికాయి.

చైనా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా నిర్వహించిన కరోనా పరీక్షల్లో తప్పుడు ఫలితాలు వస్తున్నాయన్న సమాచారంతో ఐసీఎంఆర్ వెంటనే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల వినియోగాన్ని నిలిపివేసింది. చైనా కంపెనీలు ఈ కిట్లను ఎంతో హడావిడిగా రూపొందించి ఉంటాయని భారత్ కు చెందిన అంటువ్యాధుల నిపుణుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Related posts