telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లో … ఇంజినీర్లకు ఉద్యోగాలు…

jobs for engineers in sail

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది. సెయిల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఖాళీలు 399 ఉన్నాయి. ఇందులో విభాగాల వారీగా చూస్తే .. విభాగాలవారీ ఖాళీలు : మెకానికల్‌ -156, మెటలర్జికల్‌ -67, ఎలక్ట్రికల్‌ -91, కెమికల్‌ -30, ఇనుస్ట్రుమెంటేషన్‌ -36, మైనింగ్‌ ఇంజినీరింగ్‌ -19 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టులో బీఈ / బీటెక్‌ ఉత్తీర్ణత ప్రధాన అర్హత.

గేట్‌ స్కోర్‌ ను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. మొదట రాతపరీక్ష ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా నియమకాలు ఉంటాయి. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దఖాస్తు చేసుకునేందుకు చివరితేది డిసెంబరు 15 గా ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌ : https://www./sailcareers.com/ చూడొచ్చు. చాలామంది అందరూ అప్లయ్ చేసే పాపులర్ ఉద్యోగాల వైపే చూస్తారు కానీ .. విస్తృతంగా ఉన్న అవకాశాలను అధ్యయనం చేయరు . ఈ ప్రకటన మీకు ఉపయోగపడకపోయినా .. మీకు తెలిసిన వారికి ఈ సందేశం ఫార్వార్డ్ చేయండి.

Related posts