హైదరాబాద్ ప్రశాంతతను, మత సామరస్యాన్ని మజ్లీస్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న అంబర్ పేట్ లో లేనిపోని సమస్యలను ఎంఐఎం సృష్టిస్తోందని ఆరోపించారు.తెలంగాణ ప్రభుత్వం చేతకానితనం వల్లనే ఈ సమస్య తలెత్తిందన్నారు. తాను అంబర్ పేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని అన్నారు.
అంబర్ పేటలో అక్కడ అసలు మసీదు లేదని, కానీ ఉన్నట్టుగా చూపే ప్రయత్నం ఎంఐఎం చేస్తోందని ఆరోపించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఆ వివాదాస్పద స్థలాన్ని ఆ స్థలం యజమానులకు ప్రభుత్వం డబ్బు చెల్లించి స్వాధీనం చేసుకుందని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌తో దోస్తానీ చేస్తే ఏమైనా చెయ్యొచ్చా అని నిలదీశారు. దీనికి అధికార పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇప్పుడు తెలివిలోకి వచ్చాడు.. పవన్ పై విజయసాయి విమర్శలు