telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

48 సంవత్సరాల “ఎదురులేనిమనిషి”

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక హిట్ చిత్రం వైజయంతి మూవీస్ “ఎదురులేనిమనిషి”
12 డిసెంబర్ 1975 విడుదల.

నిర్మాత అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు కె. బాపయ్య గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కథ,మాటలు: భమిడిపాటి, పాటలు: ఆత్రేయ, సంగీతం: కె.వి.మహదేవన్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎస్.వెంకటరత్నం, కళ:ఎస్.కృష్ణారావు, నృత్యం: శ్రీను, ఎడిటింగ్: అక్కినేని సంజీవి, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, వాణిశ్రీ, జగ్గయ్య, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, కాంతారావు, రాజబాబు, అల్లు రామలింగయ్య, ఆనందమోహన్, భీమరాజు, జగ్గారావు, హేమలత, నిర్మలమ్మ, పద్మప్రియ,జ్యోతిలక్ష్మి గిరిజారాణి, తదితరులు నటించారు.

ప్రఖ్యాత సంగీత దర్శకులు కె.వి.మహాదేవన్ సంగీత సారధ్యంలో వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
“కసిగావుంది కసికసిగావుంది కలవక కలవక కలిసి నందుకు కస్సుమంటుంది”
“హే కృష్ణా ముకుందా మురారి కాస్త కళ్ళు మూసుకో ఈ సారి”
“ఎంతవాడి వెంతవాడి వయ్యావురో బంగారుసామీ”
“అబ్బా, దెబ్బ తగిలిందా…ఎక్కడో ఎక్కడో తగలని తాపులో తగిలింది”
వంటి పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హుషారైన పాటలుతో పాటు ఎన్టీఆర్ గారి స్టెప్స్, గెటప్ ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి ఎన్టీఆ “ఎదురులేనిమనిషి” 12-12-1975.

ఎన్.టి.రామారావు గారి తో సినిమా నిర్మించాలనే పట్టుదలతో ఎన్టీఆర్ గారి అభిమాని అయిన అశ్వనీదత్ ఆయనను ఒప్పించి “ఎదురులేని మనిషి” చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. ఆ పిదప ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు స్టిల్ ను తన వైజయంతి మూవీస్ బ్యానర్ లోగో గా ఏర్పాటు చేసుకున్నారు.

ఈ చిత్రం ఘన విజయం సాధించి మొదటి వారం 17 లక్షల రూపాయలు, రెండు వారాలకు 25 లక్షల రూపాయలు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ భారీ యాక్షన్ మూవీ రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టి దిగ్విజయంగా విడుదలైన అన్ని కేంద్రాలలో 50 రోజులు,
5 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది.
100 రోజులు ఆడిన కేంద్రాలు:–
(1) హైదరాబాద్ – వేంకటేశ 70MM (56 రోజులు)+ సాగర్ (44 రోజులు)
(2) గుంటూరు – కృష్ణమహల్ (71 రోజులు)+జ్యోతి మహల్ (30 రోజులు)
(3) కాకినాడ – దేవి 70MM + పద్మనాభ (షిఫ్ట్)
(4) నెల్లూరు — కనక మహల్ (డైరెక్ట్)
(5) విజయవాడ — అప్సర(56 రోజులు)+ రాజకుమారి
(షిఫ్ట్) తో శతదినోత్సవం జరుపుకున్నది.

Related posts