telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్ రెండో జట్టుకు కూడా గట్టి పోటీ…

వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌ ఫైనల్‌‌ తర్వాత, ఇంగ్లండ్‌‌‌‌తో సిరీస్‌‌‌‌ కోసం ప్రిపరేషన్స్‌‌‌‌ కొనసాగిస్తుండగా.. మరోవైపు ఓ కొత్త కెప్టెన్‌‌‌‌ సారథ్యంలోని ఇండియా బీ‌‌‌ టీమ్‌‌‌‌.. శ్రీలంకలో వన్డే, టీ20ల్లో బరిలోకి దిగనుంది. 20 మంది ప్రధాన‌‌‌, నలుగురు స్టాండ్‌‌‌‌బై ప్లేయర్లు ఇంగ్లండ్‌‌‌‌ గడ్డపై ఉండగానే.. లంక సిరీస్‌‌‌‌ కోసం ఓ పాతిక మంది వెయిటింగ్‌‌‌‌లో ఉన్నారు. గతంలో నేషనల్‌‌‌‌ టీమ్‌‌‌‌కు ఆడే అర్హత, సత్తా ఉన్న ప్లేయర్లను వెతుక్కున్న సందర్భాలను అధిగమించి.. ఒకే టైమ్‌‌‌‌లో రెండు జట్లను బరిలోకి దింపే స్థాయికి మన వనరులు పెరిగాయి. డొమెస్టిక్‌‌‌‌ క్రికెట్‌‌‌‌, ఐపీఎల్‌‌‌‌తో వెలుగులోకి వచ్చిన ఎంతో మంది యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌.. ఇప్పుడు ఇండియా-బి టీమ్‌‌‌‌ కోసం పోటీపడుతున్నారు. దీంతో టీమ్‌‌‌‌లో ఉండే అన్ని ప్లేస్‌‌‌‌లకు విపరీతమైన ఆప్షన్స్‌‌‌‌ అందుబాటులోకి రావడంతో సెలెక్టర్లకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.‌‌ శిఖర్​ ధావన్‌‌‌‌, పృథ్వీ షా, సంజు శాంసన్‌‌‌‌, సూర్యకుమార్​యాదవ్, దేవదత్‌‌‌‌ పడిక్కల్‌‌‌‌, రుతురాజ్​ గైక్వాడ్‌‌‌‌, మనీశ్​ పాండే, ఇషాన్​ కిషన్‌లు ఇండియా బి టీమ్ టాపార్డర్ కోసం పోటీపడుతున్నారు. దేవదత్‌‌‌‌ పడిక్కల్‌‌‌‌ కూడా ఐపీఎల్‌తో సెంచరీతో చెలరేగాడు. సూర్యకుమార్, ఇషాన్​, శాంసన్‌‌‌‌, సీనియర్​ మనీశ్​ పాండేతో మిడిలార్డర్​లో ఎలాంటి సమస్య లేదు. శాంసన్, కిషన్‌‌‌‌ ఇద్దరూ వికెట్‌‌‌‌ కీపర్లుగా పనికొస్తారు. ఇక భువనేశ్వర్​ కుమార్, నవదీప్​ సైనీ, దీపక్‌‌‌‌ చహర్, జైదేవ్​ ఉనాద్కట్, ఖలీల్​ అహ్మద్​, హర్షల్​ పటేల్, చేతన్ సకారియాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అలాగే యుజ్వేంద్ర చహల్, కుల్దీప్‌‌‌‌ యాదవ్, రాహుల్ చహర్, వరుణ్ చక్రవర్తిలు మధ్య పోటీ ఉంది.

Related posts