వేసారిన గుండెకు
వేణుగాణమంటాను..
నన్ను నడిపే
చుక్కానివంటాను…
నేను సాగే చీకటి దారుల
ధ్రువతారవంటాను..
నా ప్రాణానికి
ఊపిరి నీవంటాను..
నాలో సాగే నిర్మసల
అంతరవాహిని వంటాను…
నా ధైర్యం
నీవంటాను..
నా సర్వం
నీవంటాను…
నా జీవిత వలపు
వసంతం నీ వంటాను..
నీవు కాదంటే
ఈ ఊపిరి వద్దంటాను..
-అమృతవల్లి అవధానం, ప్రొద్దుటూరు