telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగినిగా శ్రద్ధా కపూర్… లుక్ వైరల్

Shraddha-Kapoor

గతేడాది ‘సాహో’తో ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్… ఇప్పుడు ‘నాగిని’ పాత్రలో అభిమానులను అలరించనుంది. బాలీవుడ్‌లో నాగిని పాత్ర చాలా ఫేమస్. గతంలో వైజయంతీ మాల, రీనా రాయ్, రేఖ, శ్రీదేవి తదితర ప్రముఖ హీరోయిన్లు ఈ పాత్రను పోషించగా, ప్రస్తుతం శ్రద్ధాకు ఆ లక్కీఛాన్స్ దక్కింది. మరాఠీ సినిమా ‘లాపాచప్పి’తో ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ విశాల్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే నాగినిగా శ్రద్ధా కపూర్ ఎలా ఉంటుందోనని ఆమె ఫ్యాన్స్‌ క్రియేటివీని బయటకు తీస్తున్నారు. నాగిని పాత్రలో శ్రద్ధ ఊహిస్తూ పోస్టర్లను తయారుచేసి సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలా తన దృష్టికి వచ్చిన వాటిల్లో ఓ పోస్టర్ శ్రద్ధను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఇప్పుడు శ్రద్ధ కపూర్ నాగిని లుక్ వైరల్ అవుతోంది.

Related posts