telugu navyamedia
సినిమా వార్తలు

నిరీక్షణ..

నీ కోసం కళ్ళన్నీ ….
వెన్నెల వెలుగై వేచి చూస్తున్నవి ..
నీ నిరీక్షణలో గుండెలో మండుతున్న బాధ…
నీ చల్లని చూపుతో చల్లార్చలేవా ….
నీ ప్రేమ లో మంచులా కరిగిపోవాలనుకున్నా ..
కానీ నీ విరహ జ్వాలా నను కాల్చేస్తుంది రా!
ప్రతి దినం నీ రాక కోసం ….
ఎదురు చూస్తూ కళ్ళన్నీ…..
విరబూసిన కలువలయ్యాయి !
నిదుర రాని నేత్రాలు…..
వీధి దివిటీలు గా మిగిలాయి …..
వేచి వేచి అలసి సొలసిన కళ్ళు…..
అపుడే విరబూసిన ఎర్రని మందారాలయ్యాయి !
నీ ఆగమనం నాలో రేపేను ఎన్నో…
ఎన్నో  ప్రణయ సుఖాల పారవశ్యం….
నీ నిరీక్షణ నాలో రేపే ప్రతి క్షణం…..
ఒక్కొక్క రకంగా వేధించే యమపాశం.
కనికరించలేవా,తరుణి  ని…..
తలపులు తెలియని,ప్రేమ తెలియని….
ప్రవరాఖ్యుడు లా ….
కరిగిపోతున్న కాలం లో….
నేను నిరీక్షించే సమయం అంతా….
ఆవిరైపోతుంది రా!

-జె.పద్మావతి,ఆదోని.

Related posts