telugu navyamedia
సినిమా వార్తలు

చీప్‌గా వాగొద్దు, చీప్‌గా బిహేవ్ చేయవద్దు.. – బండ్ల గణేశ్‌కు పూరీ జగన్నాథ్‌ వార్నింగ్‌?!

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘చోర్ బజార్’. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పూరీ జగన్నాధ్ పై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశం మొత్తం కల్లాపు చల్లాడు. కానీ, ఇంటి ముందు కల్లాపు చల్లడానికి టైం లేదు, కన్న కొడుకు ఫంక్షన్‌కు వచ్చేంత టైం లేదా? అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇప్పుడు బండ్ల గణేష్ కి పూరీ జగన్నాధ్ ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు. సినిమాలతో పాటు, పూరి జగన్నాధ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో పాడ్‌కాస్ట్‌లను చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వీటికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

తాజాగా మరొక మ్యూజింగ్ ను షేర్ చేశాడు పూరి జగన్నాథ్. టంగ్ ​​పేరుతో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, బండ్ల గణేష్ గురించేనని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు.

గుర్తు పెట్టుకోండి! మన నాలుక కదులుతున్నంత సేపూ మనం ఏమీ నేర్చుకోలేం. అందుకే, జీవితంలో ఎక్కువ టైమ్ లిజనర్స్ గా (ఇతరులు చెప్పింది వింటూ) ఉంటే మంచిది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు… క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు… ఆఫీస్ పీపుల్ కావచ్చు… ఆఖరికి కట్టుకున్న పెళ్ళాం ముందు కూడా ఆచితూచి మాట్లాడండి. చీప్‌గా వాగొద్దు, చీప్‌గా బిహేవ్ చేయవద్దు. మన వాగుడు మన కెరీర్ ను, మన క్రెడిబిలిటీని డిసైడ్ చేస్తుంద‌ని అన్నారు.

మీకు సుమతి శతకం గుర్తుండే ఉంటుంది. ‘నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతి’ అని! తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం చాలా మంచిది. నీ జీవితం, మరణం నీ నాలుక (మాటల) మీద ఆధారపడి ఉంటాయ‌ని అన్నారు. అయితే బండ్లను ఉద్దేశించి ఇలా మాట్లాడారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో తన తదుపరి చిత్రం జన గణ మన చిత్రం తో బిజీగా ఉన్నారు.

Related posts