telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాని సినిమా రీమేక్ రైట్స్‌ను పొందిన దిల్ రాజు

Dilraju

ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు ఇప్పుడు తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌కి చెందిన ఓ సంస్థతో కలిసి దిల్ రాజు తెలుగు సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ఆయన నిర్మించిన ‘ఎఫ్ 2’నే కాకుండా ‘జెర్సీ’ వంటి చిత్రాలను బాలీవుడ్ వారికి అందించేందుకు ఇప్పటికే అక్కడ దిల్ రాజు నిర్మాణం స్టార్ట్ చేశారు. తాజాగా ఆయన మరో సినిమాని బాలీవుడ్‌లో నిర్మించేందుకు హీరో నాని దగ్గర నుంచి రైట్స్ తీసుకున్నారట. నాని కూడా ఈ మధ్య నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడనే విషయం తెలిసిందే. నాని నిర్మించిన ఓ చిత్రానికి సంబంధించిన రీమేక్ రైట్స్‌ను దిల్ రాజు పొందినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఇటీవల వచ్చిన ‘హిట్’ సినిమాని బాలీవుడ్ ప్రేక్షకులకు అందించేందుకు దిల్ రాజు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా బాలీవుడ్ రీమేక్‌లో ఎవరు నటిస్తారనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది.

Related posts