telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

అక్షయ తృతీయ కు .. అమేజాన్ భారీ ఆఫర్లు…

amazon huge offers on akshaya tritiya

అమేజాన్ సంస్థ అక్షయ తృతీయను పురస్కరించుకుని బంగారు, వెండిపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ-కామెర్స్ సంస్థల్లో అగ్రగామి అయిన అమేజాన్.. అక్షయ తృతీయను బాగా క్యాష్ చేసుకుంటుంది. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండిని కొనడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని.. సంపద వెల్లివిరిస్తుందని విశ్వాసం. అందుకే ఈ రోజున బంగారం కొంటుంటారు.

ఈ విశ్వాసాన్ని క్యాష్ చేసుకునేందుకు అమేజాన్ సిద్ధపడింది. వందకు మించిన బ్రాండ్‌లు, 4 లక్షలకు పైబడిన డిజైన్ నగలకు ఆఫర్లు, క్యాష్ బ్యాక్ ప్రకటించింది. ఈ క్రమంలో బంగారం, వెండి నాణేలపై 20 శాతం ఆఫర్ ప్రకటించింది అమేజాన్. ఇంకా ఎస్‌బీఐ క్రిడిట్ కార్డులను ఉపయోగించి బంగారు లేదా వెండి నాణేలను కొనుగోలు చేసే వారికి 10శాతం అదనపు ఆఫర్‌ను ప్రకటించింది.

అమేజాన్ బె-బ్యాలన్స్ ద్వారా బంగారం కొంటే 15 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఇక అమేజాన్‌లో కొనే బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలపై తరుగు, తయారీ చార్జీలు లేవు. రూ.10వేలకు పైగా బంగారం కొనే వారికి వెండి నాణెం ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఒక గ్రాము బంగారు నాణేన్ని ప్రత్యేక బహుమతిగా బంగారం కొనే 100 మంది కస్టమర్ల పేర్లను లాటరీ ద్వారా ఎంపిక చేసి వారికి అందించనున్నట్లు అమేజాన్ వెల్లడించింది. ఇంకా బంగారు చైన్లపై తయారీ ఛార్జీలు 50శాతం ఆఫర్ ఇవ్వడంతో పాటు 22 క్యారెట్, 916 హాల్ మార్క్ ఆభరణాలకు 15 శాతం అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటిస్తున్నట్లు అమేజాన్ తెలిపింది.

Related posts