telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సాయి పల్లవికి నాగ చైతన్య విషెష్

Sai-Pallavi

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రం `లవ్‌స్టోరీ`. ఈ రోజు సాయి పల్లవి పుట్టినరోజు. ఈ సందర్భంగా సాయి పల్లవికి హీరో నాగచైతన్య పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమాలో ఆమెకి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేశాడు. వర్షంలో తడుస్తూ డ్యాన్స్ చేస్తున్న సాయిపల్లవి మరోసారి అందర్నీ ఫిదా చేస్తోంది. ‘లవ్‌స్టోరీ’ సినిమాకు సంబంధించిన టీజర్, సాంగ్ లిరికల్ వీడియోలు ఇప్పటికే విడుదలై ఆదరణ పొందాయి. లాక్‌డౌన్ తర్వాత సినిమా విడుదల కానుంది. ఇక, సాయిపల్లవి నటిస్తున్న మరో సినిమా `విరాటపర్వం`. `విరాటపర్వం` యూనిట్ కూడా సాయిపల్లవి లుక్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Related posts