ఆస్ట్రేలియాలో ఓ దొంగ కోసం పోలీసులు తెగ గాలిస్తున్నారు. క్వీన్స్‌ల్యాండ్‌లోని ఓ స్టోర్‌లోకి రాత్రి సమయంలో దూరిన దొంగ షాపులోని అనేక వస్తువులను ఎత్తుకెళ్లాడు. ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగులు ఇంకా అనేక వస్తువులు కూడా ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల్లో ముఖం కనిపించకుండా దొంగ మాస్క్‌ను కూడా ధరించుకున్నాడు. ఏదో మామూలు మాస్క్ ధరిస్తే పెద్ద వార్త అయ్యేది కాదేమో కానీ… దొంగ ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాస్క్ ధరించుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండింగ్ అయ్యింది. సీసీ ఫుటేజ్ ద్వారా ఎవరికైనా ఆచూకీ తెలిస్తే చెబుతారని వీడియోను విడుదల చేసినట్టు పోలీసులు తెలిపారు. దొంగ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా అధికారులు కోరారు.
previous post
next post