ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ చిత్రం “దిల్ సే”. ఈ సినిమాలోని “ఛయ్యా ఛయ్యా” పాట ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ చాలామంది ఈ పాటను ఇష్టపడుతుంటారు. ఆ పాట బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా అంతలా పాపులర్ అయిపోయింది. ఈ పాటతోనే బాలీవుడ్ ఐటెం బాంబ్ మలైకా అరోరా తెరంగేట్రం చేసింది. ఈ ఒక్క పాటతోనే ఆమె బాలీవుడ్ లో స్టార్ గా మారిపోయింది. అయితే తాజాగా ఆ పాట షూటింగ్ సమయంలో తానెదుర్కొన్న సంఘటనలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో మలైకా పంచుకుంది. “ఆ పాట చిత్రీకరణ మొత్తం కదులుతున్న రైలు పైనే ఉంటుంది. గాలి కూడా చాలా బలంగా వీచేది. దీంతో నేను చాలా సార్లు పట్టుతప్పి పడిపోయేదాన్ని. దీంతో నేను వేసుకున్న గాగ్రాకి, రైలుకి కలిపి తాడు కట్టేశారు. పాట మొత్తం నేను అలా తాడు కట్టుకునే డ్యాన్స్ చేశాను. పాట షూటింగ్ అయిపోయాక తాడు విప్పితే నా నడుమంతా రక్తసిక్తం అయిపోయింది. తాడు రాపిడికి ఒరిసిపోయి అలా జరిగింది” అని మలైకా చెప్పుకొచ్చింది.
previous post