telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మంచి మనసు చాటుకున్న సాయిధరమ్

Sai Dharam Tej

మెగా హీరో సాయిధరమ్ మరోసారి తన వితరణ చాటుకున్నారు. విజయవాడలో అమ్మ ప్రేమ ఆదరణ అనే ఓల్డ్ ఏజ్ హోమ్ రెన్నోవేషన్ తో పాటు నిర్మాణానికి సంబంధించి సహాయసహకారాలు అందించారు. అది పూర్తవగా గత రాత్రి విజయవాడకు వెళ్ళి ఆరంభించారు. ప్రారంభం తర్వాత అక్కడే ఉన్న వృద్ధులతో కొంత సమయం గడిపారు సాయిధరమ్ తేజ్. అంతే కాదు ఒక ఏడాది పాటు అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వహణ బాధ్యత కూడా తీసుకుంటానని ప్రామిస్ చేయటం విశేషం. గతేడాది విజయవాడకు చెందిన ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు సోషల్ మీడియాలో తమ దుస్థితిని తెలియచేస్తూ సాయం చేయవలసిందిగా అభ్యర్ధించారు. అది తెలిసి సాయిధరమ్ స్పందించి పక్కా నివాసగృహాన్ని ఏర్పాటు చేసి స్వయంగా ప్రారంభంలో పాల్గొనటం అభినందించదగ్గ విషయం.

Related posts