telugu navyamedia
సినిమా వార్తలు

హేమ ఆరోపణలకు ఘాటు కౌంట‌ర్‌..!

‘మా’ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఇటీవల హేమ చేసిన ఆరోపణలపై ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌ స్పందించారు. అసోసియేషన్‌ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడార‌ని, తను ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకర‌మ‌ని, హేమ‌పై చ‌ర్య‌లు తీసుకుంటామని హెచ్చరించారు.

`మా`కి సంబంధించి ఒక్క రూపాయి కూడా గోల్‌మాల్‌ జరగలేదని, ఇప్పటికీ సరిపడ మనీ `మా`లో ఉందన్నారు. కరోనా దృష్ట్యా ‘మా’ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిస్థితులకు అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయని వివరించారు.

ఈ మేరకు మా జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్ తో కలిసి అసోసియేషన్ నిధుల వ్యయంపై మరోసారి వివరాలు వెల్లడించిన ఆయన… మా అధ్యక్ష పదవిపై తనకు ఎలాంటి వ్యాయోహం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో హేమ వ్యాఖ్యలు అర్థరహితమన్న నరేశ్‌… ఆగస్టు 22న జరిగే సర్వసభ్య సమావేశంలో నిర్ణయం మేరకు ఎన్నికలు ఉంటాయని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మా ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.

ఈ సందర్భంగా మా కార్యదర్శి జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘హేమగారు చెప్పిన ఈ మాటలన్నీ చాలా తప్పుగా అనిపించాయి. ఎందుకంటే అందరం కూర్చొని దీనిపై చర్చించుకున్నాం. ఈ సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఎన్నికలు ఎవరు పెట్టమంటున్నారు? సభ్యులను గందరగోళానికి గురి చేయొద్దు. ఆలోచించి ఓటు వేసే అవకాశాన్ని ‘మా’ సభ్యులకు కల్పిద్దాం. ఎవరికి ఓటు వేయాలి? ఎవరు పని చేస్తారు? వాళ్లను ఆలోచించుకుని ఓటు వేయనీయండి. అసోసియేషన్‌లో మనకు ఫండ్‌ ఉన్నది సభ్యుల ప్రయోజనాలకోసమే కదా’ అని అన్నారు.

ఇదిలాఉంటే `మా` ఎన్నికల బరిలో ఇప్పటికే ఐదుగురు నిల్చున్నారు. ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్‌, సీవీఎల్‌ నర్సింహరావు పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. దీంతో `మా` ఎలక్షన్ల రసవత్తరంగా మారాయి. 

 

 

 

Related posts