ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామికి చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. ఏడాది పొడువునా చందనంతో కప్పి ఉండే స్వామివారు ఈ ఒక్క రోజు మాత్రం నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు సింహగిరికి తరలివస్తారు.
ఈ ఏడాది వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయను పురస్కరించుకుని ఈరోజు చందనోత్సవం జరుగుతోంది. లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవంలో భాగంగా సింహాచలేశుని తెల్లవారుజామున 1 గంటకు సుప్రభాత సేవతో మేల్కొలిపి గంగధార నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత బంగారు, వెండి బొరిగెలతో స్వామి దేహంపై కప్పి ఉంచిన చందనాన్ని తొలగించారు. అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి వంశానికి చెందిన అశోక్‌గజపతి రాజు కుటుంబసమేతంగా తొలి పూజ చేశారు.
ఆ తరువాత వీవీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. స్వామి దర్శనం కోసం పలువురు ప్రముఖులు సింహగిరికి విచ్చేశారు. హోం మంత్రి చినరాజప్ప, డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఎంపీ అవంతీ శ్రీనివాస్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తదితరులు స్వామిని దర్శించుకున్నారు.
టీడీపీ అవినీతి చిట్టా బయటపెడతాం: జీవిఎల్