రామయణం సీరియల్ తొలిసారి 1987 నుంచి 1988 మధ్య కాలంలో దూరదర్శన్‌లో ప్రసారం అయ్యింది. ఈ సీరియల్ అప్పట్లో ఎంతో జనాధారణ పొందింది. ప్రచారసమాచార శాఖ.. మరోసారి రామయణం సీరియల్‌ను దూరదర్శన్‌లో ప్రసారం చేయాలని భావిస్తున్నది. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో జనం ఇండ్లకే పరిమితమయ్యారు.
ఈ నేపథ్యంలో పబ్లిక్ డిమాండ్ దృష్ట్యా ఈ సీరియల్‌ను శనివారం నుంచి మళ్లీ ప్రసారం చేయనున్నట్లు కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ సీరియల్ ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 10 వరకు ఒక ఎపిసోడ్, ఆ తర్వాత రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్‌ను ప్రసారం చేస్తారు.