ఓ పెట్రోల్ బంక్ లో విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిలకలూరిపేట మండలం రామచంద్రపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న పెట్రోల్ బంకులో ఓ ఇనుప స్టాండ్ సాయంతో విద్యుత్ బల్బు మారుస్తున్న సమయంలో స్టాండ్ 11 కేవీ లైన్ కు తగిలింది.దీంతో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు వ్యక్తులు మరణించారు.
మృతులను బొప్పూడి, పోలిరెడ్డిపాలెం గ్రామస్థులుగా గుర్తించారు. డేరంగుల శ్రీనివాసరావు(45) షేక్ మౌలాలి(22) ఘటనా స్థలంలోనే మృతి చెందగా, శేఖర్ (48) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.