telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

బసవ తారకం ఆస్పత్రికి అరుదైన గౌరవం

basavatarakam hospital

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో-అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రికి అరుదైన గౌరవం లభించింది. ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నవారు సామూహికంగా ఆలపించిన జాతీయ గీతాలాపనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక చొరవతో రోగులతో గీతాలాపన చేయించి ఈ గౌరవాన్ని సాధించుకున్నట్లు ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ ఎల్‌.ఎమ్‌.చంద్రశేఖర్‌రావు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎవరూ చేయలేని సాహసాన్ని బసవతారకం ఆస్పత్రి రోగులు చేయడాన్ని ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు వారు గుర్తించారని తెలిపారు.

ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు వారు అందజేసిన మెడల్స్‌, పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేన్సర్‌బారిన పడి మెడ, నాలుక భాగాలు పాడై చికిత్స పొందిన రోగులతో 72వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా గీతాలాపన చేయించామన్నారు. ఈ నెల 20 నుంచి హెడ్‌, నెక్‌ రిహాబిలిటేషన్‌ క్లినిక్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ రిహాబిలిటేషన్‌లో వివిధ థెరపీల ద్వారా చికిత్స చేయడం రోగుల బంధువులకు నేర్పిస్తామన్నారు.

Related posts