telugu navyamedia
రాజకీయ వార్తలు

డెవలపింగ్ కంట్రీస్ కు మంచి ఉదాహరణ ఇండియా: డొనాల్డ్ ట్రంప్

trump usa

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాను టార్గెట్ చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. చైనా అభివృద్ధి చెందుతున్న దేశమే అయితే, అమెరికా కూడా అభివృద్ధి చెందుతున్న దేశమేనని అన్నారు. తాజాగా వైట్ హౌస్ లో జరిగిన మీడియా కాన్ఫెరెన్స్ లో మాట్లాడిన ఆయన అభివృద్ధి చెందుతున్న దేశాలమన్న సాకుతో పలు దేశాలు పెద్ద మొత్తంలో లాభపడుతూ ఉన్నాయని, ఆ ముసుగులో చైనా కూడా లాభపడుతోందని మండిపడ్డారు.

యూఎస్ సహా పలు దేశాల నుంచి చైనా లాభం పొందుతోందని, ఆ దేశాన్ని ‘డెవలపింగ్ కంట్రీస్’ లిస్ట్ లో ఉంచడమే ఇందుకు కారణమని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశానికి మంచి ఉదాహరణగా ఇండియాను పేర్కొనవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. .అభివృద్ధి చెందిన దేశాలు కూడా, చెందుతున్న దేశాల పేరుతో ప్రయోజనాలు పొందుతున్నాయని పరోక్షంగా ట్రంప్ చైనాపై నిప్పులు చెరిగారు.
a

Related posts